ఎర్రచందనం దొంగపై పీడీ యాక్ట్
KDP: దువ్వూరు(M) పుల్లారెడ్డిపేటకు చెందిన ఎర్రచందనం దొంగ ఇరుగంరెడ్డి నాగ దస్తగిరి రెడ్డిపై నాలుగోసారి పీడీ యాక్ట్ నమోదైనట్లు మైదుకూరు గ్రామీణ సీఐ శివశంకర్ యాదవ్ తెలిపారు. నాగ దస్తగిరి రెడ్డిపై ఇప్పటివరకు మొత్తం 128 కేసులు ఉన్నాయని అన్నారు. వీటిలో ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 80, మరో 38 చోరీ కేసులు ఉన్నాయని చెప్పారు.