జిల్లాలో ఇసుక కొరత లేకుండా చూడాలి: కలెక్టర్
కృష్ణా: జిల్లాలో ఇసుక కొరత లేకుండా సామాన్యులకు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ బాలాజి అధికారులను ఆదేశించారు. గురువారం మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఉచిత ఇసుక విధానం అమలుపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. సరఫరా వ్యవస్థను క్రమబద్ధంగా నిర్వహించాలని, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదన్నారు.