చంద్రశేఖరపురంలో 94 మందికి నోటీసులు జారీ

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలో వికలాంగుల పెన్షన్ పొందుతున్న 94 మంది లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో బ్రహ్మయ్య తెలిపారు. వికలాంగుల పెన్షన్ లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తిస్తున్నట్లు చెప్పారు. నోటీసులు అందుకున్న వారు తాము పెన్షన్ పొందుటకు అర్హులని తెలిపేలా సంబంధిత సర్టిఫికెట్లతో ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని కోరారు.