VIDEO: 43 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

KMM: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఉదయం 8.15 గంటలకు గోదావరి నీటిమట్టం 43 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద నీరు కళ్యాణకట్ట వరకు చేరింది. నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముందుస్తు జాగ్రత్తుగా అధికారులు గజ ఈతగాళ్లు, లాంచీలు ఏర్పాటు చేశారు.