VIDEO: కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
HNK: కమలాపూర్ మండల కేంద్రంలో వడ్లు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించుకోవాలని సూచించారు. రైతులకు తగిన సదుపాయాలు కల్పించాలని, పంటల కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.