2,024 పోస్టులు గిరిజనులకే: మంత్రి సంధ్యారాణి

AP: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు డిమాండ్ భావ్యమా? అని మంత్రి సంధ్యారాణి ప్రశ్నించారు. ఆదివాసీ గిరిజన యువత అధైర్యపడవద్దని తెలిపారు. వైసీపీ రాజకీయ ఆటలో నిరుద్యోగ యువత పావులుగా మారొద్దని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలోనే గిరిజనులకు న్యాయం జరుగుతుందన్నారు. 16,437 డీఎస్సీ పోస్టుల్లో 2,024 పోస్టులు గిరిజనులకేనని స్పష్టం చేశారు.