'పసుపు రైతును ఆదుకునేందుకు కృషి జరగాలి'

'పసుపు రైతును ఆదుకునేందుకు కృషి జరగాలి'

NZB: పసుపు పంటను సాగు చేస్తున్న రైతాంగం ఇబ్బందులను పరిష్కరించి వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకురాజకీయాలకు అతీతంగా కృషి జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ ఛైర్మన్ ఎం.కోదండరెడ్డి అన్నారు. గురువారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ పసుపు రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, వాటిని పరిష్కరించాలన్నారు.