VIDEO: శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజలు

VIDEO: శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజలు

KDP: సిద్దవటం పెన్నానది ఒడ్డున శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి శివాలయంలో కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ పూజారి స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.