కబడ్డీ పోటీల్లో సత్తా చాటిన తాడిపత్రి అమ్మాయిలు

కబడ్డీ పోటీల్లో సత్తా చాటిన తాడిపత్రి అమ్మాయిలు

ATP: ఆర్డీటీ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో తాడిపత్రి అమ్మాయిలు సత్తా చాటారు. SGFI ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో అండర్-17 విభాగంలో అర్షియ, అవనిక, చాందిని, అండర్-14 విభాగంలో ఆయేషా జిల్లాస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని కోచ్ తెలిపారు.