యాదగిరిగుట్టలో పాలిసెట్‌కు ఉచిత శిక్షణ

NLG: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీజీ పాలిసెట్-2025 ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు యాదగిరిగుట్ట పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు.