ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలకు ఏర్పాట్లు

NTR: ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా మహోత్సవాలకు ఆలయ ఈవో శీనానాయక్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, అడిషనల్ ఎస్పీ రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు తదితరులు ఏర్పాట్ల పురోగతిని పర్యవేక్షించారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని అధికార యంత్రాంగం సూచించింది.