'భూ బాధితుల సమస్యను పరిష్కరించండి'

'భూ బాధితుల సమస్యను పరిష్కరించండి'

MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామికవాడ అభివృద్ధికి భూములిచ్చిన రైతులకు తక్షణమే పరిహారం అందేలా చూడాలని ఆ గ్రామ సర్పంచ్ రాజనర్సింహా కోరారు. మంగళవారం తహసీల్దార్ ఆంజనేయులును కలిసి వినతిపత్రం అందజేశారు. బాధితులకు న్యాయం చేయాలని విన్నవించగా, తహసీల్దార్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు సాదు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.