గణతంత్ర వేడుకల్లో కొడంగల్ కళాకారుడు.!
VKB: ఢిల్లీలో జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ రాష్ట్రం నుంచి కొడంగల్ మండలం సంగాయిపల్లికి చెందిన ఒగ్గు కళాకారుడు శివ కుమార్ ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి ఎంపికైన 30 మంది ఒగ్గుడోలు కళాకారుల బృందంలో ఇతను ఒకరు. ఈ నెల 26న రాష్ట్రపతి, ప్రధాని సమక్షంలో తన కళా ప్రతిభను చాటే అవకాశం రావడం అదృష్టమని శివ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు.