విడవలూరులో వందేమాతరం గేయలాపన కార్యక్రమం
NLR: విడవలూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం వందేమాతరం గేయలాపన కార్యక్రమం నిర్వహించారు. వందేమాతరం గేయాన్ని బంకించంద్ర చటర్జీ రాసి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్త గేయలాపనలో భాగంగా కళాశాలలో అందరూ ఈ గేయాన్ని పాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుజాత, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.