ప్రేమానురాగాలకు ప్రతీక రక్షాబంధన్: మాజీ ఎమ్మెల్యే

NLG: ప్రేమానురాగాలకు రాఖీ పౌర్ణమి ప్రతీక అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా జరుపుకునే రక్షా బంధన్ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. జీవితాంతం తమకు అండగా ఉండాలని ఆడబిడ్డలు తమ అన్నదమ్ములకు అనురాగాలతో చేతికి రక్షా బంధాన్ని కట్టడం గొప్ప సందర్భం అని తెలిపారు.