నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరైన అచ్చంపేట ఎమ్మెల్యే

NGKL: అచ్చంపేట నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో నమోదైన పలు కేసుల విషయమై అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గురువారం హైదరాబాద్ నాంపల్లి ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులపై కేసులు పెట్టి వేధించిందన్నారు.