చెరువులు కుంటలను పరిరక్షించాలి కలెక్టర్
HNK: జిల్లాలో ఉన్న చెరువుల ప్రాముఖ్యతను గుర్తించి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో చెరువులు కుంటల పరిరక్షణపై ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షించారు.