ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
MDK: ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన రామాయంపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని కోమటిపల్లి శివారులోని ఎక్కలుదేవ్ బండ వద్ద కంకర లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ పల్లపురాజు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు విచారణ చేపట్టారు.