కిటకిటలాడిన మెదక్ చర్చ్

MDK: మెదక్ జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్ఐ చర్చి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం ప్రెస్బీటర్ ఇంఛార్జీ శాంతయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఏసుక్రీస్తు జీవిత చరిత్రపై ఒక నాటకాన్ని ప్రదర్శించారు. సెలవు దినం కావడంతో చర్చిని సందర్శించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.