ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

JGL: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి శనివారం రూ.2,65,230 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,37,187 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.91,700, అన్నదానానికి రూ.36,343 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా తెలిపారు.