'అక్రమార్కులకు అడ్డగా మీనవోలు ఇసుక రీచ్'
KMM: మీనవోలు ఇసుక రీచ్ అక్రమార్కులకు అడ్డాగా మారిందని బీఆర్ఎస్ పార్టీ ఎర్రుపాలెం మండల కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అక్రమ ఇసుక రవాణా పై మంగళవారం మండల బీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు. ఇందిరమ్మ ఇళ్ల కూపన్లను అడ్డుగా పెట్టుకుని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారన్నారు.