'FRS హాజరు నమోదు కట్టుదిట్టంగా నమోదు చేయాలి'

KMM: ప్రభుత్వ పాఠశాలల్లోనీ విద్యార్థులు, ఉపాధ్యాయులకు FRS ద్వారా హాజరు కట్టుదిట్టంగా నమోదు చేయాలని అదనపు కలెక్టర్ డా.శ్రీజ అన్నారు. ఇవాళ కలెక్టరేట్‌లో FRS విధానంలో హాజరు నమోదుపై విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. విద్యా శాఖ పరిధిలో వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలని, పాఠశాలల వారీగా పారిశుద్ధ్య నిర్వహణ మెరుగు పర్చాలని పేర్కొన్నారు.