ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
GDWL: గట్టు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సుమారు 230 మంది రోగులకు నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు. వైద్యాధికారులు పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలు సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.