భూసేకరణ పరిహారం.. మరో విడత విడుదల

NLR: ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో భూసేకరణకు పరిహారంగా కలెక్టర్ మూడో విడతగా రూ.29.57 కోట్లు విడుదల చేసి, 38 మంది రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఈ విడతతో కలిపి ఇప్పటివరకు 139 మంది రైతులకు చెందిన 293.4 ఎకరాలకు రూ.62.38 కోట్లు చెల్లింపు పూర్తయింది. ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో ఇప్పటికే 635 మంది రైతులు 1265 ఎకరాలకు అంగీకార పత్రాలు ఇచ్చారు.