'ప్రైవేట్ ఆసుపత్రులు నిబంధనలు తప్పకుండా పాటించాలి'

KMM: ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహణలో నిబంధనలు తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఆసుపత్రిలో వివిధ వైద్య సేవలకు వసూలు చేసే ఫీజుల వివరాలు, ధరల పట్టిక ప్రదర్శించాలని చెప్పారు. ఆరోగ్య శ్రీ పథకం పట్ల అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.