'స్టాలిన్' రీ రిలీజ్‌లో పవన్ 'UBS' గ్లింప్స్

రేపు మెగాస్టార్ చిరంజీవి తన 70వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన 'స్టాలిన్' మూవీ 4K వెర్షన్‌లో రేపు రీ రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ థియేటర్లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ గ్లింప్స్‌ను ప్రదర్శించనున్నారు. దీంతో మెగా, పవర్ అభిమానులకు ఇది మంచి ట్రీట్ అని చెప్పొచ్చు. ఇక 'UBS'ను హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.