రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి
AP: ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొయ్యలగూడెం శివారు పులివాగు సమీపంలో బైక్‌ను ట్రాలీ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న దంపతులు మృత్యువాత పడ్డారు. మృతులు ప్రత్తి జయరాజు(52), భార్య సత్యవతి(45)గా పోలీసులు గుర్తించారు. మృతుదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.