ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం

ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం

MLG: పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం మొదలైంది. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షంతో కాస్త ఉపశమనం లభిస్తుంది. కాగా, ఇప్పటికే వడగళ్ల వర్షం, ఈదురుగాలులతో నేలమట్టమైన వరి పంటలు కోతలకు కూడా పనికొచ్చేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో రాలిన వడ్లు సైతం మొలకొచ్చే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.