అప్పికొండ ఆలయంలో ఉద్రిక్తత

అప్పికొండ ఆలయంలో ఉద్రిక్తత

VSP: మహాశివరాత్రి సందర్భంగా అప్పికొండ సోమేశ్వర స్వామి ఆలయం సోమ‌వారం భక్తులతో కిటకిటలాడింది. లింగోద్భవ సమయంలో శివలింగానికి పంచామృతాభిషేకం చేసే గదికి అధికారులు తాళం వేయడంతో వివాదం చెలరేగింది. తాళాలు తీయాలని శివస్వాములు కోరినా స్పందన లేకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సంప్రదాయాలకు అడ్డుపడుతున్నారంటూ భక్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.