సైబర్ మోసాల కేసును ఛేదించిన పోలీసులు

BPT: సైబర్ మోసాల కేసును బాపట్ల పోలీసులు ఛేదించారు. శుక్రవారం కేసు వివరాలను ఎస్పీ తుషార్ దూడి వెల్లడించారు. దేశవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేసిన రాజస్థాన్‌కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. బాపట్ల హరిత రిసార్ట్స్, తిరుమల, శ్రీశైలం వంటి దేవస్థానాల పేరుతో నకిలీ సైట్లను రూపొందించినట్లు తెలిపారు.