రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

KRNL: కల్లూరు మండలం పెద్దపాడు గ్రామ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 40 ఏళ్లు ఉంటుందని అంచనా. మృతుడి చేతులపై ఉన్న 'హరిత', 'మహిశ్రీ' అనే పచ్చబొట్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.