చింతగూడ సర్పంచ్ ఏకగ్రీవం
RR: గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నామినేషన్ రెండో రోజు కీలక పురాణం చోటుచేసుకుంది. షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం చింతగూడ సర్పంచ్ ఎన్నిక పూర్తయింది. గ్రామ అభివృద్ధి చేసి చూపిస్తానని ఆగమయ్య అనే వ్యక్తి ముందుకు రావడంతో అతనిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పంచాయతీ పరిధిలోని అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆగమయ్య తెలిపారు.