గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

PDPL: గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చౌరస్తా వైపు వెళ్తున్న i20 TS22F3419 కారు వేగంగా వస్తూ రాజేశ్ థియేటర్ సమీపంలో మూలమలుపు వద్ద ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న శ్రీధర్ అనే సింగరేణి ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మిగతా వారిని ఆసుపత్రికి తరలించారు.