బుద్ధ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు

ప్రకాశం: బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు కనిగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ సయానా బేగం గురువారం తెలియజేశారు. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, కంచి, అరుణాచలం, తిరుత్తిని క్షేత్రాలకు ఈ నెల 10వ తేదీన ప్రత్యేక బస్సు సర్వీసులను నడపడం జరుగుతుందని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.