నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు
MBNR: కోయిలకొండ మండలంలోని రామన్నపల్లి తండాలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం నిరుపయోగంగా మారింది. రూ.లక్షలు వెచ్చించినా అక్కడ ఆట వస్తువులు లేవని, కేవలం బోర్డు మాత్రమే దర్శనమిస్తోందని యువకులు గ్రామసభలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నామమాత్రపు పనులతో మైదానం నిరుపయోగంగా మారిందని, తమ సమస్యను పట్టించుకునే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.