జీజీహెచ్‌లో పెరుగుతున్న జ్వరం కేసులు

జీజీహెచ్‌లో పెరుగుతున్న జ్వరం కేసులు

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెలియాయిడోసిస్ జ్వరం కేసులు అధికం అవుతున్నాయి. బల్కోర్డేరియా సూడోమాలి బ్యాక్టీరియా ద్వారా ఈ జ్వరం వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. తడి నేలల్లో బ్యాక్టీరియా ఉంటుందని, పాదరక్షలు లేకుండా తేమ నెలలో నడిచే వారిపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్తున్నారు. జ్వరం, దగ్గు, కీళ్ల నొప్పుల లక్షణాలు ఉన్నవారు జాగ్రత్త వహించాలన్నారు.