రేపు ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు

రేపు ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు

CTR: తవణంపల్లె మండలంలోని అర్థగిరి వీరాంజనేయ స్వామి ఆలయంలో రేపు కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మునిశేఖర్ తెలిపారు. రేపు ఉదయం 9 గంటలకు అభిషేకం, 11కి సుదర్శన హోమం, రాత్రి 7 గంటలకు ఉత్సవ విగ్రహంతో ప్రాకారోత్సవం నిర్వహించినున్నట్లు పేర్కొన్నారు. అలాగే, రాత్రి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.