ఘనంగా స్వర్గీయ దామోదర సంజీవయ్య జయంతి వేడుకలు
VZM : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య 105 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్లో దామోదరం సంజీవయ్య చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్ పూలమాలలు వేసి, జ్యోతిని వెలిగించి ఘనంగా నివాళులర్పించారు.