VIDEO: భార్య కుటుంబీకులపై భర్త కత్తి దాడి

VIDEO: భార్య కుటుంబీకులపై భర్త కత్తి దాడి

HNK: న్యూ శాయంపేట ప్రాంతంలో సోమవారం రాత్రి కుడికాల అఖిల్ అనే వ్యక్తి తన భార్య కుటుంబీకులపై కత్తితో దాడి చేశాడు. భార్యాభర్తల మధ్య విభేదాల నేపథ్యంలో జరిగిన ఈ ఘటనలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన సజ్విత తల్లి సునీత, సోదరుడు గుండు రామన్‌కు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు.