రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: ఎమ్మెల్యే
NLG: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారితో సమావేశమయ్యారు. ఈసారి ఖరీఫ్ దిగుబడి అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నామని, ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు.