'సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

ప్రకాశం: గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలోని కోటగడ్డ వీధిని మున్సిపల్ కమిషనర్ రమణ బాబు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వీధిలో శానిటేషన్ పనులను పరిశీలించి పారిశుద్ధ్య కార్మికులకు సూచనలు ఇచ్చారు. సీజనల్ వ్యాధులు సోకుతున్న నేపథ్యంలో డ్రైనేజీ కాలువలను శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లాలని సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు.