ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఆడే గజేందర్

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఆడే గజేందర్

ADB: బోథ్ మండలంలోని కౌట (బి) గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారు రామోజీ సునీతను శాలువాతో సన్మానించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు స్వంత గృహం కలగడం ఆనందకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.