రైతులు అర్జీలు ఇవ్వండి: ఎమ్మిగనూరు MRO
KRNL: రీసర్వే ద్వారా తలెత్తిన భూ సమస్యలను గ్రామసభల ద్వారా పరిష్కరిస్తామని ఎమ్మిగనూరు ఎమ్మార్వో శేషఫణి వెల్లడించారు. దేవిబెట్టలో శనివారం జరిగిన గ్రామసభలో ఎమ్మార్వో మాట్లాడారు. రీసర్వేలో దొరలిన తప్పులను సరి చేసేందుకు రైతులు గ్రామసభలో అర్జీలు ఇవ్వాలని కోరారు. వాటిని 15 రోజుల్లో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.