ఏకగ్రీవం చేస్తే రూ.50 లక్షల ఇస్తా.. కానీ చివరికి!

ఏకగ్రీవం చేస్తే రూ.50 లక్షల ఇస్తా.. కానీ చివరికి!

HNK: హసన్‌పర్తి మండలం జయగిరి గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ అనివార్యమైంది. స్వతంత్ర అభ్యర్థి న్యాయవాది తాళ్లపల్లి వెంకటేశ్ ఏకగ్రీవం చేస్తే గ్రామాభివృద్ధికి రూ. 50 లక్షలు ఖర్చు చేస్తానని ప్రకటించారు. నిన్న సాయంత్రం ఇతర అభ్యర్థులు ఉపసంహరణకు అంగీకరించినా, అధికార పార్టీ అభ్యర్థి పల్లె దయాకర్ హాజరుకాలేదు. ఫలితంగా ఉపసంహరణ గడువు ముగిసి పోటీ ఖరారైంది.