సేవల్లో అంతరాయం.. క్షమాపణలు చెప్పిన సంస్థ
దేశవ్యాప్తంగా పలు ఇండిగో విమాన సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో బెంగళూరు, ముంబై, HYDలో 70కి పైగా విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ ఇండింగో సంస్థ క్షమాపణలు చెప్పింది. సాంకేతిక సమస్య, ఆపరేషనల్ సమస్యలు, సిబ్బంది కొరత కారణంగా అంతరాయం ఏర్పడినట్లు తెలిపింది. సర్వీసులు రద్దు కారణంగా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.