VIDEO: చిట్వేలిలో ఐదు గ్రామాలకు ప్రత్యేక అధికారి నియామకం
అన్నమయ్య: చిట్వేలి మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో పాలనాధికారిగా పనిచేస్తున్న పద్మభూషణ్ రెడ్డిని ఐదు గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈ నియామకం నేతివారిపల్లి, నగరిపాడు, కంప సముద్రం, దేవమాచుపల్లి, మాలేమార్పురం గ్రామ పంచాయతీలకు వర్తిస్తుంది. శుక్రవారం నగరిపాడు గ్రామ పంచాయతీలో పద్మభూషణ్ రెడ్డి ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.