పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
PPM: జియ్యమ్మవలస మండలం తాళ్లడుమ్మలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఇన్విజిలేటర్లను ఆదేశించారు.