అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు
కృష్ణా: పెడన పట్టణంలో కొలువైన శ్రీ పైడమ్మ అమ్మవారికి, పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ సతీమణి కాగిత శిరీష ఆదివారం పట్టువస్త్రాలను సమర్పించారు. సతీసమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె, ఆలయ కమిటీ వారిచే సత్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.