సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన దయానంద్
RR: గూడూర్ గ్రామ సర్పంచ్‌గా ఒక అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని దయానంద గుప్తా అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని గూడూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా దయానంద్ గుప్తా నామినేషన్ వేశారు. వారు మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా, పేదవారి కలను నెరవేర్చడమే ముఖ్య ఉద్దేశంగా భావించి నామినేషన్ వేసినట్లు పేర్కొన్నారు.