ఒంటి పూట బడులు.. పిల్లలపై ఓ కన్నేయండి: DSP

నాగర్ కర్నూలు జిల్లా: వేసవి సెలవుల్లో చల్లదనం కోసం పాఠశాల, కళాశాల విద్యార్థులు చెరువులు, బావుల్లో ఈతకు వెళ్లేందుకు ఉత్సాహం చూపుతుంటారని, మీ పిల్లలు ఆ వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ తెలిపారు. పిల్లలకు పెద్దల పర్యవేక్షణలోనే ఈత నేర్పించాలని, సాయంత్రం 6 గంటల వరకు పిల్లలు నీడపట్టునే ఆడుకునేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.